అమిత్ షాకు వాజ్ పేయి నివసించిన ఇల్లు

SMTV Desk 2019-06-07 17:07:59  amitshah, vajpay,

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి నివసించిన ఇంటిని ప్రభుత్వం కేటాయించింది. 6-ఎ కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న ఈ ఇంటిలో వాజ్‌పేయి తుదిశ్వాస విడిచే వరకు నివసించారు. గతేడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూశారు. ప్రస్తుతం షా 11 అక్బర్ రోడ్డులో నివసిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా, హోంమంత్రిగా ఉన్న అమిత్ షా కోసం పెద్ద బంగళా కేటాయించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా ఆయన వాజ్ పేయి నివశించిన ఇంటిని కోరినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ కమిటీ కూడా ఈ ఇంటిని కేటాయించినట్టు లేఖ ఇచ్చింది. రెండోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రివర్గంలోకి అమిత్ షాను తీసుకోవడంతో పాటు అత్యంత కీలకమైన హోమ్ శాఖను అప్పగించారు. అయితే ఈ విషయం మీద అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు.