ముంబై లో దారుణం, ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారం

SMTV Desk 2019-06-07 16:59:25  mumbai, rape,

ముంబయి: ఎయిర్ హోస్టెస్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ముంబయిలో జరిగింది. ఓ మహిళ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తుంది. స్వప్నిల్ బడోడియా అనే ఆమె స్నేహితుడు కూడా అదే ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నాడు. స్వప్నిల్ బడోడియా గోనినగర్‌లోని ఓ ఫ్లాట్‌లో పెయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. డిన్నర్ చేసే నిమిత్తం మహిళ స్పప్నిల్ ఫ్లాట్‌కు వచ్చింది. ఈ క్రమంలో డ్రింక్స్ కూడా తీసుకుంది. మద్యం మత్తులో తనపై స్వప్నిల్ బడోడియా, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారని ఎంఐడిసి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారం చేసినట్టు స్వప్నిల్ బడోడియా పోలీసుల ఎదుట అంగీకరించాడు. అయితే ఈ ఘటనలో తన స్నేహితుల ప్రమేయం లేదని అతడు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. బాధిత ఎయిర్ హోస్టెస్‌కు వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.