విటమిన్ డి ఎంత ఉండాలి?

SMTV Desk 2019-06-06 15:32:51  vitamin d,

భారతదేశంలో చాలా మంది మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. మనం ఎంతసేపు సూర్యరశ్మిలో ఉంటామన్న దానిపైనే మన శరీరంలోని విటమిన్ – డి ఆధారపడి ఉంటుంది. శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగనిరోధక శక్తికి కూడా సూర్యరశ్మి చాలా అవసరం. భారతదేశంలో ఎక్కడా సూర్యరశ్మి సమస్య లేదు. అయినప్పటికీ మహిళలు విటమిన్ – డి లోపంతో బాధపడుతున్నారంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. ఢిల్లీలోని ఎయిమ్స్, ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టరు నిర్వహించిన పరిశోధనలో 95 శాతం మహిళ్లలో విటమిన్ డి సరిపడా లేదని, ఐదు శాతం మంది మహిళలకు మాత్రమే తగినపాళ్లలో విటమిన్ డి అందుతోందని తెలిసింది.

1. భారతీయ మహిళల్లో చాలామంది ఇంటిపనులకే పరిమితం అవుతారు కాబట్టి వారికి అందే సూర్యరశ్మి చాలా తక్కువ. * రెండోది భారతీయ మహిళలు ధరించే దుస్తులు. చాలామంది మహిళలు చీర లేదా చుడీదార్ ధరిస్తారు. ఇవి వాళ్ల శరీరంలో ఎక్కువ భాగాన్ని కప్పేస్తాయి. విటమిన్ – డి లోపానికి ఇది కూడా ఓ కారణం.

2. మూడోది ఏంటంటే.. మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు.. పిల్లలకు పాలిచ్చే దశలో, మెనోపాజ్ తరువాత మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.సూర్యరశ్మి అందకపోవడం వల్లే విటమిన్ – డి లోపం ఏర్పడుతుందని చాలామంది భావిస్తారు. అయితే.. అదొక్కటే కారణం కాదు. మనం తినే ఆహారంలో రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగిస్తే.. దానివల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ పదార్థాలు శరీరంలో విటమిన్ – డి ఏర్పడటంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందువల్ల విటమిన్ – డి లోపం ఏర్పడుతుందని డాక్టర్లు వివరిస్తున్నారు. రిఫైన్డ్ అయిల్లో ట్రాన్స్‌ఫాట్ అధికంగా ఉంటుందట. ఇది శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందట. అందువల్ల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి మహిళలు వంటల్లో రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే బదులుగా నెయ్యి, ఆవనూనెను ఉపయోగించడం మొదలుపెట్టవచ్చు అని చెబుతున్నారు.

ఎంత ఉండాలి?
మిల్లీలీటర్ రక్తంలో 75 నానోగ్రాముల విటమిన్ – డి ఉంటే అది సరైన పాళ్లలో ఉన్నట్లు లెక్క. అదే 50 నుంచి 75 నానోగ్రాములు ఉంటే విటమిన్ – డి తగినంత లేదని భావిస్తారు. మిల్లీలీటరుకు 50 నానోగ్రాముల కన్నా తక్కువ ఉంటే దాన్ని విటమిన్ – డి లోపంగా పరిగణిస్తారు. ప్రస్తుతం భారతదేశ మహిళల్లో విటమిన్ – డి కేవలం మిల్లీలీటరు రక్తంలో 5 నుంచి 20 నానోగ్రాములు మాత్రమే ఉంది. డాక్టర్ల అంచనా ప్రకారం 95 శాతం మంది భారతీయ మహిళలు విటమిన్ – డి లోపంతో బాధపడుతున్నారు. అయితే విటమిన్ – డి లోపం కేవలం మహిళల్లో మాత్రమే కాదు, పురుషుల్లోనూ ఉంది. అయితే మహిళలతో పోలిస్తే అది చాలా తక్కువ.

సూచనలు
1. త్వరగా అలసిపోవడం
2. కీళ్లనొప్పులు
3. పాదాలు వాయడం
4. ఎక్కువసేపు నిలబడలేకపోవడం
5. కండరాల బలహీనత.