జగన్‌, మోదీలను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్..

SMTV Desk 2019-06-06 12:37:06  Arrest,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితోపాటు ప్రధాని నరేంద్ర మోదీని కూడా దూషించిన టీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై ఆయన విడుదలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగిన విజయోత్సవ ర్యాలీలో రామకృష్ణబాబు ప్రసంగిస్తూ.. మోదీ, జగన్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై వైసీపీ నేతలు పోలీసులుకు ఫిర్యాదు చేయగా, ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు బుధవారం ఆయన్ను అరెస్టు చేసి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.