సఫారీలను స్పిన్ చేసిన టీంఇండియా బౌలర్స్....ఇండియా టార్గెట్ 228

SMTV Desk 2019-06-06 12:31:21  team india, india vs south africa

ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నేడు ఇంగ్లాండ్ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది దక్షిణాఫ్రికా. ఇక మొదట ఇన్నింగ్స్ కు వచ్చిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లను టీంఇండియా బౌలర్లు చిత్తు చేశారు. దీంతో 50 ఓవర్లు ముగిసేసరికి 227/9 పరుగులు చేసి ఇండియాకు 228 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందుంచారు. మొదట ఇన్నింగ్స్ కు వచ్చిన దక్షిణాఫ్రికా 1-11 (H Amla, 3.2 ov), 2-24 (Q de Kock, 5.5 ov), 3-78 (R van der Dussen, 19.1 ov), 4-80 (F du Plessis, 19.6 ov), 5-89 (JP Duminy, 22.6 ov), 6-135 (D Miller, 35.3 ov), 7-158 (A Phehlukwayo, 39.3 ov), 8-224 (C Morris, 49.2 ov), 9-227 (I Tahir, 49.6 ov)పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఇక టీంఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. బుమ్రా కూడా 10 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. పాండ్య 6 ఓవర్లు వేసి 31 పరుగులు సపర్పించుకున్నాడు. ఆ తరువాత కులదీప్ యాదవ్ కూడా 10 ఓవర్లు వేసి 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక స్పిన్నర్ చాహల్ 10 ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. కేదార్ జాదవ్ 4 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చాడు.