భర్త బాటలోనే భార్య వందన సిక్కా...

SMTV Desk 2017-08-29 15:43:19  Vishal Sikka Infosys CEO, Infosys Foundation, chairman of the USA, Resign from office, Vandana Sikka, Blog, twitter

న్యూ ఢిల్లీ, ఆగస్టు 29 : ఇటీవల విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవోగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భార్య వందన సిక్కా కూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్, యూఎస్ఏ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఈ మెయిల్ ద్వారా కంపెనీకి తెలియజేశారు. ఈ విషయాన్ని తన బ్లాగ్, ట్విట్టర్ ఖాతాల ద్వారా వందన పేర్కొన్నారు. కాగా, రెండున్నరేళ్లుగా ‘ఇన్ఫోసిస్’, యూఎస్ఏ కు చైర్మన్ గా వ్యవహరించారు. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వందన, ‘ఇన్ఫోసిస్’లో చేరక ముందు ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని అనుకున్నారట.