ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణ విఖే పాటిల్

SMTV Desk 2019-06-05 12:27:18  radha krishna vk aptil, maharstra

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. కాంగ్రెస్ నేత రాధాకృష్ణ విఖే పాటిల్ తన MLA పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర విధాన్ సభలో స్పీకర్ కు తన రాజీనామా లేఖను అందజేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణ విఖే పాటిల్.. భారతీయ జనతా పార్టీలో చేరుతారని చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో చేయబోయే మంత్రివర్గ విస్తరణలో రాధాకృష్ణకు చోటు దక్కొచ్చని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

రాధాకృష్ణ విఖే పాటిల్ రాజీనామాతో ఈ ప్రక్రియ ఆగదని.. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే రాజీనామాలు చేసి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.

2019 జనరల్ ఎలక్షన్స్ లో మహారాష్ట్రలోనూ, దేశమంతటా బీజేపీ గాలి వీచింది. భారీ విజయం దక్కించుకుంది. రాబోయే అక్టోబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పరిణామాలతో బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.