రవితేజ కొత్త సినిమా అప్ డేట్

SMTV Desk 2019-06-03 16:35:53  ravi teja, payal rajuput

సీనియర్ స్టార్ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీగా వేసిన్ సెట్‌లో ఇటీవలే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో హీరో, విలన్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా మరో రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్, ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభానటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.