పోసానికి ఆపరేషన్.. పలువురు ప్రముఖులు పరామర్శ

SMTV Desk 2019-06-03 15:52:54  Posani,

ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి కొంతకాలంగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతమైందని పోసాని తెలిపారు. ఆయనను పలువురు సినీ ప్రముఖులు, వైసిపి నేతలు పరామర్శించారు. తనకు నడుము కింది భాగంలో ఇబ్బందిగా ఉందని, దీంతో సరిగా నడవ లేకపోతున్నట్టు పోసాని ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉండడంతో ఆపరేషన్ ను వాయిదా వేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం ఆపరేషన్ విజయవంతమైందని పోసాని పేర్కొన్నారు. ప్రస్తుతం పోసాని ఆరోగ్యం కుదుట పడిందని యశోదా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.