ఎన్డీయేను వ్యతిరేకించి చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు

SMTV Desk 2019-06-03 15:18:55  Chandrababu ,

ఏపీ అభివృద్ధి కోసం జగన్ ఎన్టీయేతో సఖ్యతగా ఉండాలన్నారు కేంద్రమంత్రి రాందాస్ అథవాలె సూచించారు. ఎన్డీయేను వ్యతిరేకించి చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారని..అలాంటి తప్పే జగన్ మళ్లీ చేయొద్దన్నారు. కేంద్రం ఏపీకి మద్దతుగా ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా గురించి కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తెలంగాణకు కూడా కేంద్రం మద్దతుగా ఉంటుందని.. సీఎం కేసీఆర్ ఎన్డీయేలో చేరాలని సూచించారు అథవాలె.