గుర్మీత్ ఎటువంటి దయాదాక్షిణ్యాలకు అర్హుడు కాదు : సీబీఐ కోర్టు

SMTV Desk 2017-08-29 10:41:12  GURMITH SINGH BABA, CBI COURT VERDICT, CBI COURT JUDGMENT.

చండీఘడ్, ఆగస్ట్ 29 : డేరా బాబా చేసిన ఆగడాలకు అడ్డుకట్ట పడింది. తనను ఎంతగానో ఆరాధించే తన ఇద్దరు భక్తురాళ్ల పైనే అత్యాచారానికి ఒడి కట్టిన ఆ వివాదాస్పద బాబా పాపం పండింది. ఆ ఇద్దరు భక్తురాళ్లు బాబాను దైవంగా పూజించేవారు, ఎంతో భక్తితో విశ్వసించేవారు. తనను అవివేకంగా నమ్మిన అనుచరులపై గుర్మీత్ కొంచెం కూడా కనికరం లేకుండా లైంగిక దాడి చేయడం ద్వారా తీవ్ర నేరానికి పాల్పడి, ఒక మృగంలా ప్రవర్తించాడు. గుర్మీత్ సింగ్ చేసిన నేరాలను అత్యంత తీవ్రమైన నేరాలుగా పరిగణించిన సీబీఐ కోర్టు.. తన రెండు కేసుల్లో ఒక్కోదానికి గానూ పదేళ్లు చొప్పున మొత్తం ఇరవై ఏళ్లు కారాగారంలోనే ఉండాలని, ఒక్కో కేసులో రూ.15 లక్షలు చొప్పున మొత్తం రూ.30 లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పు నిచ్చారు. ఈ కేసులో గుర్మీత్ బాబా ఎటువంటి దయాదాక్షిణ్యాలకు అర్హుడు కాదని సీబీఐ ప్రత్యేక జడ్జి జగ్దీప్‌ సింగ్‌ ఈ మేరకు 9 పేజీల తీర్పు వెలువరించారు.