వచ్చే ఆదివారం వరకు వడగాల్పులు

SMTV Desk 2019-06-01 12:24:42  heatwaves,

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతమే ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశవ్యాప్తంగా సగటున 96 శాతం వర్షపాతం ఉండే అవకాశముందని తెలిపింది. వాయవ్య భారతదేశంలో 94 శాతం, సెంట్రల్ ఇండియాలో వంద శాతం, దక్షిణ ద్వీపకల్పంలో 97 శాతం, ఈశాన్య భారతదేశంలో 91 శాతం వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలైలో దేశవ్యాప్తంగా 95 శాతం, ఆగస్టులో 99 శాతం వర్షపాతం ఉంటుందని ఐఎండీ వివరించింది.

మరోవైపు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల వర్షపు జల్లులు పడుతున్నాయి. వాతవరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో వడగాల్పులు వచ్చే ఆదివారం వరకు కొనసాగనున్నట్లు సమాచారం.