అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణతో ఎంట్రీ.. ఇప్పుడు ప్రిన్స్ మహేష్ తో రీఎంట్రీ

SMTV Desk 2019-06-01 11:57:42  Vijaya Shanti, Mahesh babu,

సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి చాలా కాలమే అయింది. ఇంతకాలం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె సుమారు 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదేమంటే... మహేష్ కొత్త సినిమా అయిన సరిలేరు నీకెవ్వరు తో అలనాటి రాములమ్మ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఓ విషయం అందరి మనసులను తొలిచి వేస్తుంది. అప్పట్లో విజయశాంతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సూపర్ స్టార్ కృష్ణ చేసిన కిలాడి కృష్ణ సినిమాతో. ఆ తర్వాత 180 సినిమాలు చేసిన ఆమె మళ్ళీ ఇప్పుడు కృష్ణ కుమారుడు మహేష్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. మొత్తానికి విజయశాంతికి కృష్ణ కుటుంబంతో భలే కనెక్టివిటీ కుదిరిందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.