ఏపీ బాధ్యతలను కూడా హైకమాండ్ నాకు అప్పగించింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

SMTV Desk 2019-06-01 11:30:39  kishan reddy

కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా మీడియాతో కిషన్ రెడ్డి తొలిసారి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ సురక్షిత స్థావరంగా మారిందని... నగరంలో వారిని పూర్తిగా కట్టడి చేస్తామని ఆయన తెలిపారు. హోంమంత్రి అమిత్ షాతో కలసి పనిచేసే భాగ్యం తనకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేనందువల్ల... ఆ రాష్ట్రాన్ని కూడా చూసుకునే బాధ్యతను తనకు అప్పగించారని... ఈ మేరకు హైకమాండ్ తనకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసిందని తెలిపారు. తనను కేంద్ర మంత్రిని చేసిన సికింద్రాబాద్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.