వెనిజులా అధికార, ప్రతిపక్షాల చర్చలు సానుకూలం!

SMTV Desk 2019-05-31 13:52:19  Venezuelas National Assembly head Juan Guaidó, Venezuela President Nicolas Maduro, russia

కారకాస్‌: వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని నార్వే ప్రభుత్వం ప్రకటించింది. అధ్యక్షుడు నికొలస్‌ మదురో, ప్రతిపక్ష నేత జువాన్‌ గైడో మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి జరుగుతున్న అంతర్జాతీయ కృషిలో భాగంగా ఈ మలి విడత చర్చలు జరుగుతున్నాయి. అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ చర్చల గురించిన కొన్ని వివరాలను మీడియాకు నార్వే విదేశాంగ మంత్రి ఎరిక్‌సన్‌ సొరైడ్‌ వెల్లడించారు. ఇరువర్గాలు ఈ ప్రతిష్టంభనకు రాజ్యాంగ పరిధిలో పరిష్కారాన్ని సాధించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని ఆమె వివరించారు. ఈ చర్చల ప్రక్రియ సమగ్రతను కొనసాగించేందుకు, ఫలితాలు సాధించేందుకు వీలుగా బహిరంగ ప్రకటనలు చేసే విషయంలో అత్యంత జాగ్రత్త గా వ్యవహరించాలని నార్వే ఇరు వర్గాలను కోరింది. ఈ చర్చల్లో నార్వే మధ్యవర్తిత్వం ఉపయోగకరంగా వుందని, ప్రతిష్టంభనకు సరైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని వెనిజులా ప్రతిపక్షం ఒకప్రకటనలో తెలిపింది.