కొడుకు ప్రమాణస్వీకారం చేస్తుండగా చప్పట్లు కొట్టిన మోదీ తల్లి

SMTV Desk 2019-05-31 12:45:30  modi

వరుసగా రెండో పర్యాయం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. ప్రస్తుతం కేంద్రమంత్రులు పదవీప్రమాణం చేస్తున్నారు. కాగా, మోదీ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది టీవీ తెరలపై వీక్షించారు. వారిలో మోదీ తల్లి హీరాబెన్ కూడా ఉన్నారు. మోదీ ప్రమాణస్వీకారం చేస్తుండడాన్ని ఆమె తన నివాసంలో ఎల్ఈడీ టెలివిజన్ తెరపై కనులారా తిలకించారు. అంతేకాకుండా, తన బిడ్డను తెరపై చూడగానే చప్పట్లు కొట్టి మురిసిపోయారు. ప్రస్తుతం హీరాబెన్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.