అన్నాడీఎంకే పార్టీ కి చుక్కెదురు

SMTV Desk 2019-05-31 12:33:25  AIDMK,

లోక్​సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ తమిళనాడులోని అధికార పార్టీ ఏఐఏడీఎంకే.. మోడీ కేబినెట్ లో చోటుదక్కుతుందని ఆశించింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఓపీ రవీంద్రనాథ్​ కుమార్​కు పదవి ఖాయమని గురువారం సాయంత్రం వరకు వార్తలు వచ్చాయి. చివరికి కేబినెట్​లిస్టులో ఆయన పేరు కనిపించలేదు. రవీంద్రనాథ్​ తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్​సెల్వం కుమారుడు. రాష్ట్రంలో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయగా.. కేవలం ఆయన ఒక్కరే గెలిచారు.

1998 లో మాజీ ప్రధాని వాజ్ పేయి కేబినెట్ లో చివరిసారి అన్నాడీఎంకేకు చోటు లభించింది. 20ఏళ్ల తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అన్నాడీఎంకే భాగస్వామి అవుతుందని వార్తలు వచ్చినా అది కలగానే మిగిలిపోయింది. అయితే.. త్వరలో కేబినెట్​విస్తరణలో అవకాశం ఉండొచ్చని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు.