మోదీ ప్రమాణ స్వీకారం....సినీనటుడి అద్భుత ట్వీట్..!

SMTV Desk 2019-05-31 12:20:57  modi

తన పుట్టినరోజు నాడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండడం తనకు దక్కిన గొప్ప భాగ్యమని ప్రముఖ నటుడు, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ఫేమ్ పరేశ్ రావల్ పేర్కొన్నారు. ఇవాళ 64వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ..

"నేను పొందదగిన అత్యంత ఘనమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన బహుమానం ఇది. మన ప్రియతమ ప్రధానమంత్రి రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నందున ఇవాళ అత్యంత పవిత్రమైన రోజు..." అని వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చిరస్మరణీయ విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచం నలు మూలల నుంచి తరలివచ్చిన ప్రముఖులతో దేశ రాజధానిలో పండుగ వాతావరణం నెలకొంది.