జగన్‌‌కు రాహుల్ గాంధీ అభినందనలు

SMTV Desk 2019-05-30 18:37:03  jagan

నవ్యాంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌కు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి అభినందనలు అందాయి. జగన్‌ను అభినందిస్తూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు. జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర ప్రజలకు తన ప్రత్యేక అభినందనలని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ సైతం ఓ ట్వీట్‌లో జగన్‌ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో మధ్నాహ్నం 12.23 గంటలకు జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు విపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తదితరులు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.