శంకర్ ఎహసన్ లాయ్ సాహో నుండి ఎందుకు తప్పుకున్నాడంటే

SMTV Desk 2019-05-30 13:30:16  saaho prabhas,

ప్రభాస్ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న సినిమ సాహో. సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ వారు 250 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తారని ఎనౌన్స్ చేశారు. కాని కొద్దిరోజుల క్రితం ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టుగా ఈ మ్యూజిక్ త్రయం ప్రకటించారు. ఇంత పెద్ద భారీ సినిమా నుండి తప్పుకోడానికి కారణాలు ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయట పడ్డది.

సాహోకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందించాల్సి ఉంది. అయితే సినిమాలో వీరు చేసే మ్యూజిక్ కాకుండా మరో సంగీత దర్శకుడి ప్రమేయం మొదలైందట. అతని కంపోజింగ్ కూడా సినిమాకు వాడుకుంటామని అన్నారట మేకర్స్. తాము కమిటైన సినిమాకు మరొకరు మ్యూజిక్ షేర్ చేసుకోవడం ఏంటని సైలెంట్ గా సైడ్ అయ్యారట ఈ మ్యూజిక్ త్రయం. ఇదే శంకర్ ఎహసన్ లాయ్ సాహో నుండి తప్పుకోడానికి అసలు కారణమని అంటున్నారు.

అయితే ఇరువురి అభిప్రాయంతోనే వారు తప్పుకున్నారట. మరి వారి ప్లేస్ లో ఎవరు సాహోని టేకప్ చేస్తారో తెలియాల్సి ఉంది. తమిళ సంగీత దర్శకుడు జిబ్రాన్ కాని తమన్ కాని సాహోకి మ్యూజిక్ అందిస్తారని అంటున్నారు.