బిజెపి జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా

SMTV Desk 2019-05-30 13:24:47  JP Nadda,

బిజెపి జాతీయ అధ్యక్షుడు వ్యవహరిస్తున్న అమిత్ షా ఈసారి గుజరాత్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలవడంతో ఆయనను ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. కనుక ఆయన స్థానంలో గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖా మంత్రిగా చేసిన జేపీ నడ్డాను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు బిజెపి ఈరోజు ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన జేపీ నడ్డా (59) ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ పార్లమెంటరీ కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో యూపీలో బిజెపి 62 స్థానాలలో గెలిచింది. బిజెపి ఘనవిజయానికి కారణం ఆయన ఎన్నికల వ్యూహాలే. మళ్ళీ ఈ ఏడాది సెప్టెంబరులో హర్యానా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఈ ఏడాది చివరిలో జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఎన్నికలలోగా ఆ నాలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకొని ఎన్నికలకు సిద్దం చేయవలసి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాలని బిజెపి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ కర్ణాటకలో మాత్రమే అడుగుపెట్టగలిగింది. దక్షిణాదిలో పార్టీని విస్తరించడానికి ఏదైనా కొత్త ఆలోచనలు చేయవలసి ఉంది. అమిత్ షా హయాంలో బిజెపి చాలా బలపడింది. ఇప్పుడు జేపీ నడ్డా పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకుపోతారో చూడాలి.