వేలాది మంది ఉద్యోగులను తొలగించిన జియో

SMTV Desk 2019-05-30 13:16:42  employees

దాదాపు 5వేల మంది ఉద్యోగులను రిలయన్స్ టెలికాం సంస్థ జియో తొలగించినట్టు తెలుస్తోంది. వీరిలో భారీ సంఖ్యలో పర్మినెంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం. మార్కెట్లో పోటీ పెరగడం, నిర్వహణా లాభం పెంచాల్సిన అవసరం రావడంతో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంతో ఈ మేరకు ఉద్యోగులను జియో తొలగించింది. మరోవైపు జియోకు సంబంధించిన ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఉద్యోగులను తొలగించినప్పటికీ... కొత్తగా చేర్చుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పారు. జియో సంస్థలో ప్రస్తుతం 15వేల నుంచి 20వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది.