'బిగ్ బాస్ 3': సుడిగాలి సుధీర్ .. రష్మిలతో సంప్రదింపులు?

SMTV Desk 2019-05-29 15:24:52  bigg boss 3

బిగ్ బాస్ .. బిగ్ బాస్ 2 కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు బిగ్ బాస్ 3 కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రియాలిటీ షోకి ఈ సారి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. ఇక కంటెస్టెంట్స్ గా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన రావలసి వుంది.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం కోసం సుడిగాలి సుధీర్ ను .. రష్మికను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం. బుల్లితెరపై ఈ ఇద్దరికీ మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ రియాలిటీ షోకి ఈ ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనీ .. ఆసక్తిని పెంచుతారని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే ఈ ఇద్దరూ కూడా యాంకర్స్ గా ప్రోగ్రామ్స్ తో బిజీగా వున్నారు. అందువలన వాళ్లు అంగీకరించకపోవచ్చనే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తుండగా, భారీ పారితోషికం చెల్లిస్తే ఓకే అనేసే అవకాశాలు ఎక్కువేననేది మరికొందరి మాట.