రకుల్ - సాయి పల్లవి మధ్య ఈగో ఫీలింగ్స్

SMTV Desk 2019-05-29 14:42:06  ngk

సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఎన్జీకే సినిమా, ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే రోజున ఈ సినిమా విడుదలవుతోంది. దాంతో సూర్య .. రకుల్ .. సాయిపల్లవి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు.

ప్రమోషన్స్ లోను రకుల్ .. సాయిపల్లవి ఎడముఖం పెడముఖంగా వుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకంటే సాయిపల్లవి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ, సెట్లో తనకంటే ఆమెనే ఎక్కువగా గౌరవిస్తున్నారంటూ షూటింగు సమయంలో రకుల్ అసహనాన్ని ప్రదర్శించిందట. అందువల్లనే ఆమెతో సాయిపల్లవి ముభావంగా ఉంటోందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరి పాత్రలకి సమానమైన ప్రాధాన్యత ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.