టోర్నీలో వీరు ప్రత్యేకం

SMTV Desk 2019-05-29 14:15:31  dhoni, kohli, rohit

ఈ ప్రపంచకప్ టోర్నీలో కొంతమంది ఆటగాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రతీ జట్టులో కీలక ఆటగాళ్ళు ఒక్కరో ఇద్దరో ఉంటారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి జట్లు కూడా కొంతమంది ఆటగాళ్లపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పాలి. భారత జట్టులో కోహ్లీ, ధోని, రోహిత్ కీలకంగా మారారు. వెస్టిండీస్ ఆండ్రి రసెల్, క్రిస్ గేల్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్‌నే నమ్ముకుంది. ఇంగ్లండ్ విజయవకాశాలు మొత్తం జానీ బైర్‌స్టో రాణించడంపైనే నిలిచాయి. ఇక, బంగ్లాదేశ్ సాకిబ్, తమీమ్‌లపై, అఫ్గానిస్థాన్ రషీద్ ఖాన్, మహ్మద్ నబిలపై ఆధారపడ్డాయి. న్యూజిలాండ్ జట్టులో కూడా ఇద్దరే కీలకంగా మారారు. ఒకరు కెప్టెన్ విలియమ్సన్ కాగా, మరోకరూ సీనియర్ ఆటగాడు రాస్ టైలర్. వీరి రాణింపుపైనే కివీస్ వరల్డ్‌కప్ ప్రస్థానం కొనసాగుతుందనడంలో సందేహం లేదు.