సీనియర్ నటుడు చంద్రమోహన్‌కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం

SMTV Desk 2019-05-29 14:13:29  sp balu, chandramohan

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్‌.. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో అందిస్తున్న జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తన పేరుతో అందిస్తున్న పురస్కారానికి ఈ ఏడాదికి గాను చంద్రమోహన్ ఎంపికైనట్టు బాలసుబ్రహ్మణ్యం మంగళవారం స్వయంగా వెల్లడించారు. వచ్చే నెల 4న తన జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని టౌన్ హాల్‌లో ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేయనున్నట్టు తెలిపారు. అలాగే, సామాజిక సేవను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి మరో అవార్డును ఇవ్వబోతున్నట్టు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.