మంచి పర్సంటేజ్ తో ఇంటర్మీడియట్ పాసైన 'సైరాత్' హీరోయిన్!

SMTV Desk 2019-05-29 12:15:57  sairat

2016 లో మరాఠీలో సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రం ‘సైరాత్’. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ రింకూ రాజ్ గురు. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆమె పాఠశాల విద్యార్థిని. ఈ చిత్రం ద్వారా ఎంతో పాప్యులర్ అయిన రింకూ, తన చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.

తాజాగా, మంచి పర్సంటేజ్ మార్కులతో రింకూ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది. తాజాగా మహారాష్ట్ర హెచ్ఎస్పీ (ఇంటర్మీడియట్) ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్మీడియట్ లో తమ కూతురుకి 82 శాతం మార్కులు వచ్చినట్టు రింకూ తండ్రి మహదేవ్ రాజ్ గురు చెప్పారు. సినిమాల్లో కొనసాగుతూనే రింకూ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుందని వివరించారు.