2 లక్షలు దాటితే జరిమానా

SMTV Desk 2017-06-03 15:04:37  money,bank,

ఢిల్లీ, జూన్ 03 : ఒకే రోజున రూ. 2 లక్షలు అంతకు మించి లావాదేవీలు జరిపితే జరిమానా తప్పదని ఆదాయ పన్ను విభాగం హెచ్చరించింది. అయితే రూ. 2 లక్షల కంటే ఎక్కువగా తీసుకున్న వారి పైన జరిమానా విధిస్తామని తెలిపింది. ఎంత నగదు తీసుకుంటే అంతే మొత్తానికి జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి లావాదేవీలు జరిపే వారి వివరాలు తెలిస్తే (blackmoneyinfo@incometax.gov.in) అనే ఈ-మెయిల్ కు సమాచారం పంపాలని ప్రజానికానికి కోరింది. రూ. 2 లక్షల అంతకుమించి నగదు లావాదేవీలు నిషేధిస్తూ ప్రభుత్వ ఆదాయ పన్ను చట్టంలో 269 ఎస్ టీ నిబంధనలను పొందుపరిచింది. ఒక రోజున ఒకే వ్యక్తితో ఎన్ని లావాదేవీలుజరిపినప్పటికీ ఇంత మొత్తంలో నగదు తీసుకోవడం నిషేధం. అయితే ప్రభుత్వం ,బ్యాంకులు,తపాలా కార్యాలయాలు, సహకార బ్యాంకులతో లావాదేవిల విషయంలో ఇందుకు మినహాయింపు ఉంది.