సూర్య స్పీచ్ కి నెటిజన్లు ఫిదా ..

SMTV Desk 2019-05-29 11:59:27  Surya Speech, NGk,

సూర్య హీరోగా సెల్వ రాఘవన్ అలియాస్ శ్రీ రాఘవ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎన్.జి.కే. మే 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగులో రాధామోహన్ రిలీజ్ చేస్తున్నారు. హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది.అందరికి నమస్కారం అంటూ వ్యాఖ్యతగా చేస్తున్న సుమకు థ్యాంక్స్ చెప్పారు సూర్య.. ఇక సినిమా గురించి చెబుతూ ఫ్యాన్స్ కు ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. రోజు సోషల్ ఫ్లాట్ ఫాంలో అవతల వాళ్లు ఏం చేస్తున్నారు.. అవతల వాళ్లు ఎలాంటి తప్పులు చేస్తున్నారు.. ఎలా వారిని క్రిటిసైజ్ చేయాలని చూస్తున్నారు.. అని టైం వేస్ట్ చేసుకుంటున్నారు.. కాని మనం చేయాల్సింది అది కాదు ఇది ఎవరికి వారు తమ తప్పులను సరి చేసుకోవాలని అన్నారు సూర్య.

దేశం కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనుకునే దాని కన్నా నా దేశం కోసం నేనేం చేస్తున్నాను అన్నది ముఖ్యం. ఎన్.జి.కే సినిమా దాని గురించే మాట్లాడుతుంది. ఒక మనిషి తలచుకుంటే ఎలా సమాజాన్ని మార్చగలడు.. రాజకీయాలను మార్చగలడు అన్నది ఈ సినిమాలో ఉంటుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఇద్దరు సిఎంలు కె.సి.ఆర్, జగనన్న ఇద్దరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఇక 135 కోట్ల జనాభాలో కేవలం 2.5 పర్సెంట్ ప్రజలకు మాత్రమే పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో తెలుసని సూర్య వెళ్లడించారు. అదేమి తెలియకుండానే మనం ఓటేస్తున్నాం.. నాయకులను ఎన్నుకుటున్నామని అన్నారు. ఈ సినిమాతో రాజకీయాల గురించి కొత్తగా మాట్లాడుకుంటారని అన్నారు సూర్య. సెల్వ రాఘవన్ తో 18 ఏళ్లుగా సినిమా చేయాలని అనుకున్నా కాని అది ఈ సినిమాతో కుదిరింది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు తమని ఆదరిస్తారని.. ఈ సినిమా కూడా వారి అంచాలకు తగినట్టుగా ఉంటుందని అన్నారు సూర్య.