పలు భాషల్లో కేరాఫ్ కంచరపాలెం రీమేక్ ..

SMTV Desk 2019-05-29 11:58:27  Care of canchra palem,

లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాల్లో చిన్న బడ్జెట్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమా కేరాఫ్ కంచరపాలెం. మహా వెంకటేష్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా రిలీజ్ చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి అనుభూతికి లోనయ్యేలా సినిమా ఉంటుంది. ఈ సినిమాను తమిళ, మళయాళ భాషల్లో రీమేక్ చేస్తున్నారట నిర్మాత రాజశేఖర్ రెడ్డి.

తెలుగులో త్రిపుర సినిమా నిర్మించిన ఆయన సిద్ధార్థ్, శృతి హాసన్ నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమా తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాతగా కొనసాగుతున్న రాజశేఖర్ రెడ్డి ఈమధ్యనే సురేష్ బాబుని కలిసి కేరాఫ్ కంచరపాలెం రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారట. తమిళంలో భారీ స్టార్ కాస్ట్ తోనే ఈ సినిమా నిర్మిస్తానని చెబుతున్నార్ రాజశేఖర్ రెడ్డి. అంతేకాదు మళయాళంలో కూడా ఈ సినిమా రీమేక్ జరుగుతుందని ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని అన్నారు. తనకు బాగా నచ్చబట్టే ఈ సినిమాను తమిళ, మళయాళ భాషల్లో రీమేక్ చేస్తున్నానని అన్నారు నిర్మాత రాజశేఖర్ రెడ్డి.