‘ఇస్మార్ట్ శంకర్’ పై ఆశలు పెట్టుకున్న హాట్ భామ

SMTV Desk 2019-05-29 10:37:48  ismart shanker, Nidhi agarwal,

సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గానే ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ రెండు పెద్ద సినిమాలు చేసినా ఇంకా నిలదొక్కుకోలేదు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు ఆశించిన ఫలితాలను అందించకపోవడంతో ఆమెకు హీరోయిన్‌గా పెద్దగా క్రేజ్ రాలేదు. దీంతో ఈ బ్యూటీ తన మూడో ప్రాజెక్ట్ ‘ఇస్మార్ట్ శంకర్’ మీదే పూర్తి ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈసారి ఆమె స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో నటిస్తోంది. ఈ సినిమా హిట్టయితే క్రేజ్ దానంతటదే వచ్చేస్తుంది. ఇలాంటి సినిమాల్లో నటనకు స్కోప్ ఉన్నా లేకున్నా… సన్నివేశాలు, పాటల్లో అందంగా కనిపిస్తూ ప్రేక్షకుల మన్నన పొందవచ్చు. నటించే స్కోప్ ఉంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఆ సక్సెస్ స్థాయి వేరే లెవల్‌లో ఉంటుంది. మరి ఈసారైనా నిధిని అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.