ప్రతి ఇంటి నుంచి ఒక మోదీ.....అన్నారు నరేంద్ర మోదీ

SMTV Desk 2019-05-27 18:08:56  varanasi

వారణాసి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా మోదీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారణాసిలో బీజేపీ కార్యకర్తలతో మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, వారణాసి ఫలితం యావత్తు దేశంపై ప్రభావం చూపిందని అన్నారు. ప్రతి ఒక్కరూ వారణాసి ఎన్నికలను ఆసక్తిగా గమనించారని అన్నారు.

వారణాసి ప్రజలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రతి ఇంటి నుంచి ఒక మోదీ వచ్చి ఎన్నికల్లో పోరాడారని, తనపై పోటీ చేసిన ప్రత్యర్థులను ప్రశంసిస్తున్నట్టు చెప్పారు. వారణాసి తనకు ప్రశాంతత, మనోబలం ఇచ్చిందని అన్నారు. తాను ప్రధానినే కావచ్చు కానీ, ఇప్పటికీ సాధారణ కార్యకర్తనే అని, పార్టీ చెప్పినట్లు నడుచుకుంటానని మోదీ చేసిన వ్యాఖ్యలకు చప్పట్లు మోగిపోయాయి. కార్యకర్తల ఆనందమే, తమ పార్టీ మంత్రం అని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ను విభజించినప్పుడు ఒక్క సమస్యా రాలేదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విభజన చేశామని అన్నారు. ప్రజల మనసు గాయపడకుండా మూడు రాష్ట్రాలను విభజించామని, ఏపీ, తెలంగాణ విభజన సమస్యలు ఇప్పటీకి పరిష్కారం కాలేదని, తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ భావోద్వేగాలు చల్లారలేదని వ్యాఖ్యానించారు.