ఒకే రైలులో వరుస ప్రమాదాలు

SMTV Desk 2019-05-24 16:18:29  delhi, bhubaneshwar, rajadhani express

ఢిల్లీ-భువనేశ్వర్‌ల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వరుస ప్రమాదాలు ప్రయాణికులతో పాటు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. శనివారం ఒడిషాలోని బాలాసోర్ జిల్లా ఖండపడ రైల్వేస్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్ చివరి పెట్టె అయిన జనరేటర్‌లో మంటలు చేలరేగాయి.

వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే రైలును బోగీ నుంచి వేరు చేసి మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది, ఈ ఘటనలో జనరేటర్ బోగీ పూర్తిగా దగ్ధమైంది.

కాగా గత నెలలో ఇదే రైలులో ఆహారం తిన్న 20 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురికావడం సంచలనం కలిగించింది. ఫుడ్ పాయిజన్ కావడం వల్లే ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు నివేదికలో తేల్చారు. తాజా ప్రమాదంతో రైల్వేశాఖ అధికారులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు.