23 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్

SMTV Desk 2019-05-24 12:41:41  gang rape, mysore crime, hotel receptionist

మైసూర్‌లో దారుణం జరిగింది. సహచరుడితో కలిసి నగర విహారం చేస్తున్న 23 ఏళ్ల యువతిపై ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన సహచరుడిని రాళ్లతో చావకొట్టి.. అతడి కళ్లెదుటే దారుణానికి ఒడిగట్టారు. పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలు ఓ హోటల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. గత బుధవారం రాత్రి సహచరుడితో కలిసి బయటకొచ్చింది. నగరంలోని లింగాబుడీలో ఆగిన వారిని ఆరుగురు యువకులు అటకాయించారు. పెద్ద రాయితో సహచరుడి కాలిపై తీవ్రంగా కొట్టారు. అనంతరం అతడి ఎదుటే ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.