విశాల్‌ కు అయోగ్య సినిమా కి మరో షాక్

SMTV Desk 2019-05-10 16:43:45  vishal ayogya,

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ ని సమస్యలు తరుముతున్నాయి. ఇప్పటికే నడిగర్‌ సంఘం వివాదాలతో ఇబ్బందుల్లో ఉన్న విశాల్‌ కు అయోగ్య సినిమా మరో షాక్ ఇచ్చింది. టాలీవుడ్ సూపర్‌ హిట్‌ మూవీ టెంపర్‌ను అయోగ్య పేరుతో కోలీవుడ్‌లో రీమేక్‌ చేశాడు. విశాల్‌ ఎంతో ఇష్టంగా చేసిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. వాయిదాకు కారణాలు చిత్రయూనిట్ ప్రకటించకపోయినా ఆర్థిక సమస్యల కారణంగానే సినిమా వాయిదా పడిందన్న టాక్‌ వినిపిస్తోంది.

త్వరలోనే ఈ చిత్రం యొక్క విడుదలతేది ని ప్రకటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా పార్థిబన్ , కేఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన విశాల్‌, ‘సినిమా రిలీజ్ కోసం తాను చేయాల్సినదంతా చేశాను. ఓ నటుడిగా చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాను. అయినా సరిపోలేదు’ అంటూ ట్వీట్ చేశారు.