రాజీవ్ గాంధీ-యుద్ధనౌక వివాదంలో కొత్త కోణం

SMTV Desk 2019-05-10 13:13:07  rajiv gandhi, amitabh bachchan, bjp, congress

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌక వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. భారత యుద్ధనౌకను రాజీవ్ గాంధీ తన విహారానికి వాడుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు చేయడంతో ఈ వివాదం రేగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ఈ వ్యవహారంలోకి లాగుతూ కాంగ్రెస్ నేత దివ్య స్పందన వ్యాఖ్యానించడంతో ఇది మరో ఆసక్తికర మలుపు తిరిగింది. యుద్ధనౌకను వినియోగించినప్పుడు ఏం జరిగిందో అమితాబ్‌కి తెలుసుననీ.. ఈ వ్యవహారంపై ఆయన నిజాలు వెల్లడించాలని ఆమె కోరారు.

1987లో రాహుల్ గాంధీ ఎప్పుడూ తన సొంత పనుల కోసం ఐఎన్ఎస్ విరాట్‌ను ఉపయోగించలేదంటూ లక్షదీవుల మాజీ అడ్మినిస్ట్రేటర్ పేర్కొన్న ఓ కథనాన్ని దివ్య స్పందన షేర్ చేసుకున్నారు. 1987లో జరిగిన కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ‘‘నిజం తెలియడం కోసం అమితాబ్ బచ్చన్ నాటి విషయాలను దయచేసి నేరుగా చెప్పగలరా? ఇలాంటి సమయాల్లో కూడా మాట్లాడేందుకు ఎవరూ సంకోచించరేమో?’’ అంటూ దివ్య ట్వీట్ చేశారు.