అభిమానులకు...హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ ట్రీట్

SMTV Desk 2019-05-10 13:10:00  vijay deverakonda, vijay deverakonda birthday, arjun reddy, geetha govindam

యువ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన అభిమానులకు, ప్రజలకు ఐస్ క్రీమ్స్ అందజేశారు. యువ హీరో ఇచ్చే ఐస్ క్రీమ్ కప్ ను అందుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు.

‘ది దేవరకొండ.. బర్త్ డే ట్రక్’లో వచ్చిన విజయ్ దేవరకొండ హైదరాబాద్ నగరంలోని కొన్ని చోట్ల పర్యటించారు. ఆయా చోట్ల తన అభిమానులకు, ప్రజలకు ఐస్ క్రీమ్స్ అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ‘బర్త్ డే విషెస్’ చెప్పేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని సీసీ మీడియా నెట్ వర్క్ ఆఫీసులో విజయ్ దేవరకొండ తన బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ వేడుకకు ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.