పాకిస్థాన్ జెండా కప్పుకున్న నటిపై విమర్శల వెల్లువ

SMTV Desk 2019-05-10 13:08:35  rakhi sawant, bollywood actress, bollywood bold

ఓ మోస్తరు నటిగా, డ్యాన్సర్ గా గుర్తింపు ఉన్న రాఖీ సావంత్ కు వివాదాలు కొత్త కాదు. ఆమె తన ప్రతిభ కంటే వివాదాల కారణంగానే ఎక్కువ గుర్తింపు పొందిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా, తన యదపై పాకిస్థాన్ జెండా కప్పుకుని తన్మయత్వంలో మునిగిపోతున్న రాఖీ సావంత్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ధారా 370 అనే సినిమాలో పాకిస్థానీ అమ్మాయిగా నటిస్తున్న రాఖీ రెచ్చిపోయి నటించిందన్నది ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది.

కొన్ని చోట్ల పాకిస్థాన్ జెండాను ప్రదర్శించడం, మరికొన్నిచోట్ల ఆ జెండాను యదపై కప్పుకుని కనిపించడం చూడొచ్చు. అంతేకాదు, పాకిస్థాన్ లో అందరూ చెడ్డవాళ్లు కాదని, ప్రతి దేశంలోనూ మంచి చెడు ఉంటుందని చెబుతూ పాక్ కు మద్దతుగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టింది. దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

తానే గనుక సైన్యంలో ఉంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రాఖీని కాల్చిపారేస్తానంటూ ఓ నెటిజన్ ఆవేశం ప్రదర్శించాడు. దేశంలో కల్లోలానికి కారణమవుతూ, ఎంతోమందిని బలిగొంటున్న పాక్ కు మద్దతిస్తావా? అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.