నా అసలు పేరు కైరా అద్వాని కాదు

SMTV Desk 2019-05-10 13:01:19  kiara advani, bharat ane nenu, vinaya vidheya rama

ఇప్పుడు కుర్రాళ్లంతా కైరా అద్వాని పేరునే కలవరిస్తున్నారు. యూత్ లో తనకి గల క్రేజ్ కారణంగానే బాలీవుడ్ లో వరుస అవకాశాలతో ఈ సుందరి దూసుకుపోతోంది. కబీర్ సింగ్ .. గుడ్ న్యూస్ .. షేర్షా .. లక్ష్మీ బాంబ్ చిత్రాలతో ఆమె తన దూకుడు చూపిస్తోంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేస్తోన్న కైరా అద్వాని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది.

"నా అసలు పేరు కైరా అద్వాని కాదు .. అలియా అద్వాని. ఆల్రెడీ ఇండస్ట్రీలో అలియా భట్ వుంది. అందువలన అలియా తో మొదలయ్యే మరో పేరుతో ఇండస్ట్రీలో కొనసాగడం అంత కరెక్ట్ కాదు. నా మాట విని వెంటనే పేరు మార్చుకో అని సల్మాన్ సలహా ఇచ్చారు. ఆయన చెప్పింది నిజమేనని అనిపించడంతో నా పేరును కైరా అద్వాని గా మార్చుకున్నాను. మా అమ్మానాన్న కూడా నన్ను ఇప్పుడు ఇదే పేరుతో పిలుస్తున్నారు" అని చెప్పుకొచ్చింది.