నేను ఆ పాత్ర చేయకుండా ఉండాల్సింది

SMTV Desk 2019-05-10 12:46:00  gajini, suriya, nayanathara, murugadoss

తెలుగు .. తమిళ భాషల్లో నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళంలో ఆమె చేసిన ప్రతి సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తూ ఉంటుంది. అలా తమిళంలో ఆమె చేసిన గజిని సినిమా కూడా తెలుగులో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా అసిన్ నటించగా, రెండవ కథానాయికగా నయనతార కనిపించింది.

తాజా ఇంటర్వ్యూలో నయనతార ఈ సినిమాను గురించే ప్రస్తావిస్తూ .. "నా కెరియర్లో నేను తీసుకున్న చెత్త నిర్ణయం ఏదైనా వుందీ అంటే అది గజిని సినిమాలో నేను చేసిన పాత్రను ఒప్పుకోవడమే. ఈ సినిమాకి ముందు నా పాత్రను గురించి నాకు చెప్పింది వేరు .. తెరపై చూపించింది వేరు. దాంతో నా పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండాపోయింది. ఆ పాఠం నేర్చుకున్న దగ్గర నుంచి పాత్రల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను" అని చెప్పుకొచ్చింది.