మహర్షి టాక్.....బ్లాక్ బస్టర్ హిట్

SMTV Desk 2019-05-09 19:06:58  mahesh babu, maharshi, pooja hegde

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 వ చిత్రం మహర్షి ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఐదు షో లకు అనుమతి ఇవ్వడం తో ఉదయమే షో వేయడం జరిగింది. ఈ సినిమా చూసిన వారు తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తూ తెగ సంబరపడుతున్నారు. ట్రైలర్ లో చెప్పినట్టుగా సినిమా ప్రపంచాన్ని సినిమా ఏలేసే విధంగా ఉందని..అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ యూత్ కోసం క్లాస్ ఆడియన్స్ కోసం అని, సెకండ్ హాఫ్ పక్కా మాస్ కోసం అనే విధంగా సినిమా ఉందని చెపుతున్నారు. రైతులపై సింపతీ కాదు రైతుల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకొని వాటికి సొల్యూషన్స్ కనుక్కోవాలని థీమ్ తో సాగే సినిమా అని చెపుతున్నారు. కాస్త ఎక్కువైనా సినిమా నిడివి, కొన్ని సాంగ్స్ తప్పించి సినిమా మొత్తం అదిరిపోయిందని..మహేష్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే అని ధీమా గా చెపుతున్నారు.