నడిరోడ్డుపై కేటుగాడిని చితక్కొట్టిన మహిళ

SMTV Desk 2019-05-09 12:34:07  women beating, fake acb, bribe, fake officer

ఎదుటివాళ్ల అమాయకత్వమే మోసగాళ్లకు పెట్టుబడి. అమాయకుల్ని టార్గెట్ చేసుకొని తరచూ మోసాలు చేస్తుంటుంది ఈ బ్యాచ్. సరిగ్గా ఇలాగే ఓ కేటుగాడు ఏకంగా అవినీతి నిరోధకశాఖలో అధికారిగా అవతారమెత్తాడు. ఓ మహిళ ముందు బిల్డప్ కొట్టాడు.. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేయాలనుకున్నాడు. డ్యామిట్ కథ అడ్డం తిరగడంతో.. ఆ మహిళ శివాలెత్తిపోయింది. నడిరోడ్డుపై చెప్పు తీసుకొని నాటుగా చితక్కొట్టింది.

జంషెడ్‌పూర్‌‌కు చెందిన ఓ మహిళకు ఓ సమస్య వచ్చింది.. ఆ సమస్యను పరిష్కరిస్తానని ఓ కేటుగాడు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మహిళ ఓకే చెప్పింది. ఆ పని చేసినందుకు రూ.50వేలు లంచం అడిగాడు. కానీ ఈ కేటుగాడిపై అనుమానం రావడంతో.. మహిళ అప్రమత్తమయ్యింది. తన బంధువులకు విషయం చెప్పి.. పోలీసుల్ని ఆశ్రయించింది.

సదరు ముందుగానే లంచం డబ్బు ఇస్తానని.. ఓ ప్రాంతానికి రమ్మని ఈ కేటుగాడికి చెప్పింది. డబ్బు కోస ఆశగా రాగానే.. మహిళ చొక్కా పట్టుకొని నాలుగు తగిలించింది. చెప్పు తీసుకొని ఎడాపెడా వాయించింది. వెంటనే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆ మోసగాడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.