ఢిల్లీ లో ఘనంగా తెలంగాణ వేడుకలు

SMTV Desk 2017-06-03 13:15:53  telangana celebrations in delhi ,venugopalachary, commisioner,aravindkumar,

హైదరాబాద్ జూన్ 3:రాష్ట్ర అవతరణ వేడుకలను ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో గురువారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి తెలంగాణ జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల గౌరవ వందనాలు స్వీకరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన అమర వీరుల స్థుపాన్ని అవిష్కరించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తేజవత్, కెఎం సహాని, భవన్ రెసిడెంట్ కమీషనర్ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. దీనితో పాటు సాంస్కృతిక వేడుకలను నిర్వహించడంతో ఢిల్లీ లోని తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్ దాస్ అఠావలే, కేంద్ర సమాచార కమీషనర్ మాడభూషి శ్రీధర్, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రాంగోపాల్ రావు, రిటైర్డ్ జార్జీ నారాయణ, న్యూజీలాండ్ ఎంబసీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ, కేసీఆర్ ను తెలంగాణ బహుబలిగా అభివర్ణించారు.తెలంగాణ సాధనలో ఆయన చాలా మెరుగులు తెచ్చారు. నీళ్ళు, ఉద్యోగాలు, విద్యుత్ కోసం సాధించుకున్న తెలంగాణ లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఈ మూడేళ్ళ కాలంలో ఆర్ధికాభివృద్ధి వల్ల దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రాస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని, టీకాంగ్రాస్ నేతలు రాసిచ్చిన స్క్రీప్టు ను హిందీలో చదివి వినిపించారని ఎద్దేవా చేశారు.