బారత్‌ గెలువకుంటే నేను నిరాశకు గురవుతా: అజారుద్దీన్‌

SMTV Desk 2019-05-08 13:27:00  azharuddin, indian ex captain, icc world cup 2019

భారత జట్టు మాజీ కాప్టెన్ మహ్మద్‌ అజారుద్దీన్‌ మే 30న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ గురించి పలు ఆసక్తికర వ్యాఖలు చేశారు. రెండు సార్లు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన భారత్‌ ఈసారి కూడా టైటిల్‌ సాధిస్తుందని అజారుద్దీన్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మంగళవారం, ముంబైలో ఒక వ్యాపార కార్యక్రమంలో పాల్గొన్న అజారుద్దీన్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ...భారత్‌ టైటిల్‌ సాధించకపోతే.. అభిమానులతో తాను నిరాశకు గురవుతాన న్నాడు. భారత్‌ మరోసారి చాంపియన్‌గా నిలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే జట్టు సమతూకంగా ఉంది. జట్టులో మంచి బౌలర్లు, మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. ఫీల్డింగ్‌ కూడా పటిష్టంగా ఉంది. చాలా కాలం కృషిచేసి భారత్‌ జట్టు అన్ని రంగాల్లో సమతూకంగా మారింది అని అజారుద్దీన్‌ చెప్పాడు. భారత్‌ ప్రపంచకప్‌ను 1983లో తొలిసారిగా, 2011లో రెండోసారి గెలుచుకుంది. ఇంగ్లండ్‌లో 30న ప్రారంభంకానున్న ప్రపంచకప్‌ టోర్నీలో జూన్‌ 5న భారత్‌ తన తొలి మ్యాచ్‌ దక్షిణాఫ్రికాతో ఆడనుంది. బారత్‌ ఒకవేళ కప్‌ గెలువకుంటే.. నేను నిరాశకు గురవుతా..భారత్‌ కప్‌ సాధిస్తుందనే నా ఆశ అని మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ అన్నాడు.