అదేదో మీ ఇటలీకి వెళ్లి అక్కడివాళ్లకు నేర్పొచ్చు కదా: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్

SMTV Desk 2019-05-08 12:13:44  up cm, yogi adityanath, priyanka gandhi, rahul gandhi

ప్రధాని నరేంద్ర మోదీని దుర్యోధనుడితో పోల్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ నేతల ఎదురుదాడి కొనసాగుతోంది. బీజేపీ చీఫ్ అమిత్ షా సైతం ప్రియాంకపై విరుచుకుపడ్డారు. తాజాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రియాంకపై ధ్వజమెత్తారు. అమేథీలో ప్రియాంక మాట్లాడిన మాటలు వింటే చిన్న పిల్లలు చెడిపోతారని, ఆమె తన తిట్లను ఇటలీ వెళ్లి అక్కడి వారికి నేర్పించాలని యోగి హితవు పలికారు.

అమేథీలోని అమాయకులైన పిల్లలకు తిట్లు నేర్పడం ఎందుకు? అదేదో మీ ఇటలీకి వెళ్లి అక్కడివాళ్లకు నేర్పొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. "కాంగ్రెస్ ఎందుకు విఫలమవుతోందో తెలుసా? అది ప్రతికూల రాజకీయాలు చేస్తుంది కాబట్టి! మొదట యువరాజు (రాహుల్ గాంధీ)ని బరిలో దింపారు. ఇప్పుడు యువరాణి (ప్రియాంక గాంధీ)ని రంగంలోకి తీసుకువచ్చారు. మరి ఆ తర్వాతేమీలేదు, చివరికి అమేథీలో కూడా ఓడిపోబోతున్నారు" అంటూ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.