ముచ్చటగా మూడోసారి సుకుమార్ తో....

SMTV Desk 2019-05-08 11:29:24  bunny, allu arjun, sukumar,

ప్రస్తుతం అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ సినిమా షూటింగులో వున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ వినోదభరిత చిత్రం విశేషాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును ఆయన సుకుమార్ తో చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో సుకుమార్ బిజీగా వున్నాడు.

ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను తిరుమల అడవుల్లో చిత్రీకరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సుకుమార్ ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలో తెలియనున్నాయి.