రోడ్డు మధ్యలో గుడ్లు పెట్టిన తాచుపాము.....వీడియో వైరల్

SMTV Desk 2019-05-07 16:27:12  snake laying eggs, cobra eggs, snake eggs, viral video

ఓ తాచుపాము రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలోకి వచ్చి గుడ్లు పెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలో మద్దుర్ పట్టణంలోని ఓ ఇంట్లోకి పాము దూరింది. దీంతో ఆ ఇంట్లోవారు ప్రశన్న కుమార్ అనే స్నేక్ క్యాచర్‌ను పిలిచారు. అతడు పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా అది రోడ్డు మీదకు చేరుకుంది.

రోడ్డు మీదే గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. అలా 14 గుడ్లను పెట్టింది. అనంతరం కుమార్ దాన్ని అడవిలో వలిపెట్టాడు. పాము గుడ్లను తన వెంట తీసుకెళ్లాడు. గుడ్ల నుంచి పాములు బయటకు వచ్చిన తర్వాత వాటిని అడవిలో వదిలి పెడతానని కుమార్ తెలిపాడు.