విండీస్ మాజీ క్రికెటర్ సీమర్‌ నర్స్ కన్నుమూత

SMTV Desk 2019-05-07 16:25:33   West Indies batsman Seymour Nurse dies

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్ సీమర్‌ నర్స్‌(85) తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్నీ వెస్టిండీస్‌ దిగ్గజం డెస్‌మండ్‌ హేన్స్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. నా కోచ్‌, మెంటార్‌, మే మంతా ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇకలేరు. మేమంతా నీ బాటలోనే నడవాలనుకుంటున్నాం, మాటల్లోనూ, చేతల్లోనూ నిన్నే స్పూర్తిగా తీసుకుంటామని, ఇన్నాళ్లూ మా అందరికీ మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు, మీ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాం అని హేన్స్‌ అందులో రాశారు. గత కొంత కాలంగా సీమర్స్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత సీమర్స్‌, బార్బడోస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌లో కోచ్‌గా పని చేశారు. అంతేకాకుండా బార్బడోస్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.