సుప్రీంకోర్టు ముందు మహిళా సంఘాలు నిరసనలు

SMTV Desk 2019-05-07 16:01:35  supreme court, ranjan gogoy, mahila sangham

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ముందు ఈ రోజు మహిళా సంఘాలు నిరసనలకు దిగారు. అయితే లైంగిక వేధింపుల కేసులో సీజేఐ రంజన్ గొగోయ్‌ కు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో క్లీన్‌ చిట్‌ ఇచ్చినందుకు నిరసిస్తూ ధర్నాకు దిగారు న్యాయవాదులు, మహిళా సంఘాల కార్యకర్తలు. దర్యాప్తు తీరుపై విమర్శలు గుప్పించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు సుప్రీంకోర్టు వద్ద భారీగా మోహరించారు. న్యాయస్థానం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.