నేడు గూగుల్ పిక్సల్ 3 ఫోన్లు విడుదల

SMTV Desk 2019-05-07 16:00:02  google pixel, google

గూగుల్ సంస్థ నేడు తన పిక్సల్ 3 ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే గూగుల్ పిక్సల్ 3ఎ ఫోన్‌కు చెందిన పలు స్పెసిఫికేషన్లు నెట్‌లో లీకయ్యాయి. వాటి ప్రకారం గూగుల్ పిక్సల్ 3ఎ ఫోన్‌లో 5.6 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, క్విక్ చార్జ్‌, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక పిక్సల్ 3 ఫోన్ల ధర వివరాలను గూగుల్ ఇంకా వెల్లడించలేదు.